వంద శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్దం..

amar-nadh-04.jpg

టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిప‌డ్డారు. టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ముచ్చర్లలో 1400 మంది ఓటర్లు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ముచ్చర్లలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్దం. లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తోంది.

విశాఖలోని ముచ్చర్లలో వైయ‌స్ఆర్‌సీపీ బలంగా ఉంది. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్‌ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్‌ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్‌ ఎస్టేట్‌ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు’ అని కామెంట్స్‌ చేశారు.  

Share this post

scroll to top