నారా లోకేష్ ఆధ్వర్యంలోనే సీమరాజు పోస్టులు..

amati-rambabu-6.jpg

ఇవాళ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో రెండు ఫిర్యాదులిచ్చాం నామీద, మా పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి మీద టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. జై టీడీపీ అనే ట్విట్టర్ పేజీలో వైఎస్ జగన్ గారి మార్పింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నారు. మా నాయకుడిని అవమానించే విధంగా పోస్టులు పెడుతున్నారు. సీమరాజు అనే వ్యక్తి మా వైఎస్సార్సీపీ కండువా వేసుకొని మమ్ములను పచ్చి బూతులు తిడుతున్నారు. ఈ పోస్టింగులపై యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేశాం. ఈ పోస్టులతో మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. డీజీపీ నుంచి ఎస్ఐ వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అక్రమ కేసులు పెడుతున్నారు. సీమరాజు ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి నారా లోకేష్ సృష్టించిన రోబో సీమరాజు.

నారా లోకేష్ ఆధ్వర్యంలోనే సీమరాజు ఇండస్ట్రీ మాదిరిగా స్టూడియో పెట్టుకొని సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీపై రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారు. వైఎస్ జగన్ గారు వారి సతీమణి భారతి గారి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు తక్షణమే పోలీసులు సీమరాజు మీద యాక్షన్ తీసుకోకుంటే కోర్టుకు వెళ్తాం 14 రోజుల అనంతరం ప్రైవేట్ కేసులు వేస్తాం హైకోర్టు, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. చట్ట ప్రకారం వ్యవహరించాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టాలు వాటి పని అవి చేసుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది గత నెల 18, 19 తేదీలలో గుంటూరు నగరంలోని అనేక పోలీస్ స్టేషన్లలో సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదులు చేశాం ఇంతవరకు కేసులు నమోదు చేయలేదు మాకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.

Share this post

scroll to top