పిడుగురాళ్లలో పోలీసులు, కూటమి నేతలు కుమ్మక్కు..

kasu-04.jpg

పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప ఎన్నిక  పోలీసులు, కూటమి నేతలు కుమ్మక్క‌య్యార‌ని మాజీ ఎమ్మెల్యే కాసు మ‌హేష్‌రెడ్డి మండిప‌డ్డారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమ‌ర్శించారు.  వైఎస్‌ ఛైర్మన్‌ ఎన్నిక మ‌రోసారి వాయిదా వేయ‌డం ప‌ట్ల మ‌హేష్‌రెడ్డి స్పందించారు.  పిడుగురాళ్ల పిడుగురాళ్ల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు కాగా, గతంలో 33 వార్డులను వైయ‌స్ఆర్‌సీపీ గెలుచుకుంది. ఒక కౌన్సిలర్‌ను టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చనిపోవడంతో ఆ స్థానానికి ఎన్నికల నిర్వహించడానికి నోటిఫికేషన్ వెలువడింది. నిన్న(సోమవారం) వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్ళనివ్వకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారు.

వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్‌ నామినేషన్ కూడా దాఖలు చేయనివ్వకుండా టీడీపీ రౌడీలు అడ్డుకున్నారు. దీంతో ఈరోజుకు వైఎస్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లకు టీడీపీ నేతల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పోలీసులు, కూటమి నాయకులు కుమ్మక్కైపోయారు. వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన పదిమంది కౌన్సిలర్లను టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన  టీడీపీ నాయకులకు పోలీసులు అండగా ఉన్నారు. పిడుగురాళ్లలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంది. కిడ్నాప్ పైన కొంతమంది వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లను ఇంటి నుంచి పోలీసులే తీసుకువెళ్లారు. వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిలర్లు పోలీసులు తీసుకువెళ్లి  టీడీపీ నేతలకు అప్పగించారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం నడుస్తోంది’’ అని కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share this post

scroll to top