ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాల‌తో హోరెత్తిన మండ‌లి..

sasana-mandal-14.jpg

శాసనమండలి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైయ‌స్ఆర్‌సీపీ పట్టుబట్టగా చైర్మన్‌ అందుకు నిరాకరించారు. దీంతో ఎమ్మెల్సీలు చైర్మన్‌ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. సోషల్ మీడియా అరెస్టులపై వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు.

తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్‌ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌  కోరారు. అయినా అందుకు చైర్మన్‌ అంగీకరించలేదు. దీంతో పోడియం వద్దకు వచ్చి చేరిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. వీ వాంట్ జస్టిస్ సేవ్‌ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తుండగా మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు. కానీ, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా మండలిని చైర్మ‌న్‌ కాసేపు వాయిదా వేశారు .

Share this post

scroll to top