వైయస్సార్‌సీపీ పోరుబాట కార్యాచరణ..

ysj-4.jpg

రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై వైయస్సార్‌సీపీ పోరుబాట కార్యాచరణ ప్రకటించారు మాజీ సీఎం వైయస్‌.జగన్‌. జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్‌ కోఆర్డినేటర్ల సమావేశంలో ప్రకటన చేసారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్‌ 11న ర్యాలీ, కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రం ఇవ్వనున్నారు. ఇక రూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్ధరణకు డిమాండ్‌ చేసారు.

అలాగే డిసెంబర్‌ 27న కరెంటు ఛార్జీలపై ఆందోళన చేపట్టనున్నారు. కరెంటు ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతోపాటు కలిసి, ర్యాలీగా వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టనున్నారు. ఇక జనవరి 3న ఫీజురియింబర్స్‌మెంట్‌కోసం పోరుబాట పట్టనున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌, వసతిదీవెన బకాయిలు ఇవ్వాలని డిమాండ్‌ చూస్తూ విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్‌ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనున్నారు.

Share this post

scroll to top