వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ విడుదల చేసిన లేఖ పైన వైసిపి కౌంటర్ ఇచ్చింది. రచ్చకెక్కింది ఎవరమ్మా ? అంటూ వైసీపీ పార్టీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ గా స్పందించింది. జగన్ అలాగే షర్మిల వివాదంపై నిన్న వైయస్ విజయమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో వైఎస్ షర్మిల కు సపోర్ట్ గా విజయమ్మ లేఖ రాయడం జరిగింది. అయితే దీనిపై స్పందించిన వైసీపీ సోషల్ మీడియా విజయమ్మ పై విమర్శలు చేసింది.
వైయస్ షర్మిలను అమితంగా గౌరవిస్తామని విజయమ్మను కూడా అదే స్థాయిలో చూసుకుంటామని పేర్కొంది. జగన్ బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ప్రస్తావించకపోవడం పక్కదారి పట్టించడమే అంటూ సీరియస్ అయింది వైసిపి. షర్మిల వత్తుళ్లకు లొంగి ఆమె ఇలా వ్యవహరిస్తోందని వైసిపి పేర్కొంది. వైయస్ షర్మిల చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డి పరువు తీసే ల వ్యవహరించింది అని గుర్తు చేసింది. కానీ ఎప్పుడు జగన్ ఓపిక పట్టడని అన్ని బాధలు భరిస్తున్నాడని వైసిపి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు షర్మిల కు సపోర్ట్ గా మీరు కూడా మాట్లాడడం ఏంటని ప్రశ్నించింది.