నేడు వైయ‌స్ఆర్‌సీపీ కీలక సమావేశం..

ys-jagan-4.jpg

సూపర్‌ సిక్స్‌తో సహా హామీల ఎగవేత, సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభు­త్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై విస్తృతంగా చర్చించి, ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించడమే అజెండాగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కీలక నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10.30 గం­ట­లకు తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన­నున్నారు.

గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై సమావేశంలో నేతలకు వైయ‌స్‌ జగన్‌ మార్గనిర్దేశం చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, కరెంటు ఛార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న తీరుపై ఆందోళనలు చేపట్టడంపై సమావేశంలో చర్చిస్తారు.

Share this post

scroll to top