ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులను రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పలు సంస్థలను రాష్ట్రంలో పెట్టుబడులను పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు. ఈ రోజు ఐటీ-ఎలక్ట్రానిక్స్ , ఆర్టీజీ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.. ఐటీ పెట్టుబడులను ఏపీ రప్పించేలా కొత్త ఐటీ పాలసీ రూపకల్పనపై చర్చించనున్నారు.. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన ఐటీ పరిశ్రమలను తిరిగి రప్పించేలా చర్యలకు సీఎం చంద్రబాబు నాయుడు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీతో సమానంగా హార్డ్ వేర్ రంగం నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలని భావిస్తోంది ప్రభుత్వం. ఆర్టీజీ వ్యవస్థను ప్రజావసరాలకు అనుగుణంగా వినియోగించుకునే అంశంపై కూడా చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖలపై నేడు సీఎం సమీక్ష..
