జగన్ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్ ది ఓషన్’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, బీచ్ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సిఎం సందర్శించారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా నేడు బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా ...
Read More »Tag Archives: cm jagan
వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
Read More »జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో ముఖ్యమంత్రితో పాటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ సమీర్ శర్మ ఉన్నారు. అనంతరం మువ్వన్నెల పథకాన్నిి ఆవిష్కరించిన సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకున్నారు.
Read More »స్పీకర్ తమ్మినేని కుమారుడి వివాహ వేడుకకు హాజరైన జగన్
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహా వేడుకలో వరుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, వధువు మాధురిలను సీఎం జగన్ ఆశీర్వదించారు.
Read More »గ్యాస్ లీక్‌పై జగన్ సీరియస్
అచ్యుతాపురం సెజ్‌లో విషవాయువు లీకైన ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. విషవాయువు లీక్ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి కారణాలను వెలికితీయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరిపించాలని భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపైనా దృష్టిపెట్టాలని తెలిపారు. మరోవైపు విషవాయువు లీకైన సెజ్‌లోని సీడ్స్ కంపెనీని మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. ప్రమాదంపై నివేదిక వచ్చే వరకు కంపెనీని మూసివేయాలని యాజమాన్యాన్ని ...
Read More »జోరు వానలోనూ ఆగని అడుగు.. జనం కోసం జగనన్న
ఉదయం కోనసీమ జిల్లా పర్యటనకు బయల్దేరి వెళ్లారు సీఎం జగన్. దీనిలో భాగంగా జి.పెదపూడికి సీఎం జగన్ చేరుకునే సరికి భారీ వర్షం కురుస్తోంది. కానీ సీఎం జగన్ భారీ వర్షంలోనూ ముందుకు సాగారు. వరద బాధితులకు వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. కచ్చితంగా వరద బాధితులతో మాట్లాడాలనే తాపత్రయమే సీఎం జగన్‌లో కన్పిస్తోంది. తాను వారిని కలుస్తానని ముందుగా మాటిచ్చిన మేరకే వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని భరోసా ఇస్తున్నారు. సాధారణంగా వాతావరణం అనుకూలంగా లేనప్పుడు సీఎం స్థాయి వ్యక్తి ...
Read More »వర్షాలు, వరదలపై జగన్ సమీక్ష
రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్ దిశనిర్దేశం చేశారు. జగన్ మాట్లాడుతూ.. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయన్నారు. జులై మాసంలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని, ఇప్పడు రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందన్నారు. బుధవారం ఉదయానికి వరద పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందన్న సీఎం జగన్.. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ...
Read More »బాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదే: జగన్
చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని, సంక్షేమ పథకాలను కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో భాగంగా రెండో రోజైన శనివారం పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం జగన్ ప్రజలనుద్దేశించి సుదీర్ఘంగా ప్రసంగించారు. చంద్రబాబును ఓడించే యుద్ధంలో అర్జునుడి పాత్ర ప్రజలదేనని, తనకున్న ఏకైక అండాదండా ప్రజలేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం జగన్. ‘చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పధకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లే. చక్రాలు లేని సైకిల్‌ను చంద్రబాబు తొక్కలేకపోతున్నారు. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేసేందుకే మూడు రాజధానులు. ...
Read More »పార్టీ జెండాను గుండెగా మార్చుకున్న యోధులకు నా సెల్యూట్
13 ఏళ్ల క్రితం పావురాల గుట్టలో ప్రారంభమైన ఈ సంఘర్షణలో.. నాన్న గారి ఆశయాల సాధన కోసం, మనందరి ఆత్మాభిమానం కోసం, అవమానాలను సహించి, కష్టాలను భరించి, నన్ను అమితంగా ప్రేమించి ఈ ప్రయాణంలో నాతో నిలబడి, వెన్నుదన్నుగా నిలిచి.. మన పార్టీ జెండా తమ గుండెగా మార్చుకున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధులకు, కోట్లమంది మనసున్న మనుషులకు మీ జగన్ ప్రేమ పూర్వకంగా, హృదయపూర్వకంగా, కృతజ్ఞతా పూర్వకంగా, మీ వాడిగా, మీ ఆప్తుడిగా, మీ కుటుంబ సభ్యులుగా సెల్యూట్ చేస్తున్నా’’ అని వైయస్‌ఆర్ ...
Read More »జగన్‌ను చూసి గర్వపడుతున్నా..వైయస్ విజయమ్మ
మీ అందరి ప్రేమ సంపాదించిన వైయస్ జగన్‌ను చూసి గర్వపడుతున్నా..అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అన్నారు. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది. మీ బిడ్డల్ని వైయస్ జగన్ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్ అందిస్తారని చెప్పారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైయస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.
Read More »