Tag Archives: TDP

స్టేజ్‌పై కిందపడ్డ అచ్చెన్నాయుడు

స్వాంతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న స్మారక పోస్టర్‌ కవర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌ నిర్వహించిన ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. పోస్టర్‌ కవర్‌ ఆవిష్కరణకు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తోపాటు ఎంపి రామ్మోహన్‌నాయుడు , అచ్చెన్నాయుడు హాజరయ్యారు. అప్పటికే వేదికపై సోఫాలో రామ్మోహన్‌నాయుడు కూర్చొన్నారు. ఈ తర్వాత అచ్చెన్న కూర్చోగానే సోఫా ఒక్కసారిగా వెనక్కి ఒరిగింది. దీంతో అచ్చెన్నతోపాటు రామ్మోహన్‌నాయుడు కిందపడిపోయారు. వెంటనే భధ్రతా సిబ్బంది ఇరువురినీ పైకి లేపారు.

Read More »

నారా లోకేష్‌పై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన సందర్భంలో పరామర్శ కోసం సూర్యారావుపేట కోర్టు సెంటర్‌కు నారా లోకేష్‌, కొల్లు రవీంద్రతో పాటు పలువురు టీడీపీ నేతలు వెళ్లారు. ఈ సమయంలో లోకేష్‌ కరోనా నిబంధనలు పట్టించుకోలేదని పలువురు ఆయనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎపిడమిక్‌ యాక్ట్‌ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ నారా లోకేష్‌, కొల్లు రవీంద్ర తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, గతేడాది జూన్‌ 12న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ...

Read More »

టిడిపి కార్పొరేటర్‌ వానపల్లి రవి కుమార్‌ కరోనాతో మృతి

విశాఖ టిడిపి కార్పొరేటర్‌ వానపల్లి రవి కుమార్‌ కరోనాతో బాధపడుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. కరోనా బారినపడిన రవికుమార్‌ గత మూడు రోజులుగా విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మఅతి చెందారు. ఇటీవల జరిగిన జివిఎంసి ఎన్నికల్లో 31 వ వార్డు కార్పొరేటర్‌గా వానపల్లి రవి కుమార్‌ ఎంపికయ్యారు. గతంలో అనాథ శవాల అంత్యక్రియలు వంటి సామాజిక కార్యకలాపాలను రవికుమార్‌ నిర్వహించారు.

Read More »

హిందూపురంలో బాలకృష్ణకు ఎదురుదెబ్బ

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గం హిందూపురంలో ఎదురుదెబ్బ తగిలింది. నియోజకవర్గంలో ఉన్న 38 సర్పంచ్‌ స్థానాలకు గానూ 30 స్థానాల్లో వైసిపి బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. పెనుకొండ టిడిపి మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధికి కూడా షాక్‌ తగిలింది. ఆయన సొంత పంచాయతీ రొద్దంలో సర్పంచ్‌ అభ్యర్థి, మరువపల్లిలో వార్డు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. పెనుకొండలోని 80 స్థానాల్లో 71 చోట్ల వైసిపి మద్దతుదారులు గెలుపొందారు. హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సొంత పంచాయతీ వెంకటరమణపల్లిలో టిడిపి బలపర్చిన ...

Read More »

అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

భూమా అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌ను సికింద్రాబాద్‌ కోర్టు తిరస్కరించింది. బోయినపల్లి అపహరణ కేసులో మరింత లోతుగా అఖిలప్రియను విచారించేందుకు 7 రోజులు కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా.. మూడు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నేటి నుంచి 13 వ తేదీ వరకూ అఖిలప్రియను కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించనున్నారు. అఖిలప్రియ మెడికల్‌ రిపోర్టును చంచల్‌గూడ జైలు అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు ఆమెకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించింది. ప్రస్తుతం అఖిలప్రియ రిమాండ్‌ ఖైదీగా ...

Read More »

చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు

ఎపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న నిరసనలు నేటికి ఏడాది కావడంతో అమరావతి జెఎసి ఆధ్వర్యంలో రాయపూడిలో జనభేరి సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభకు వివిధ రాజకీయ పార్టీ నాయకులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాయపూడి సభకు వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్దండరాయుని పాలెం వెళ్లేందుకు కాన్వాయ్‌కు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో టిడిపి నాయకులు, రైతులు ఆందోళనకు దిగడంతో చివరకు రెండు వాహనాలకు అనుమతి ఇచ్చారు. కాన్వాయ్‌లో ...

Read More »

వైసిపిలో చేరిన పంచకర్ల రమేష్‌బాబు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు,  మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వైసిపిలో చేరారు.  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమక్షంలో శుక్రవారం ఆయన వైసిపిలో చేరారు. సిఎం జగన్‌ వైసిపి కండువా కప్పి రమేష్ బాబును పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపి విజయసాయిరెడ్డి, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

వైసిపిలో చేరనున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే రమేష్‌ బాబు

టిడిపి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబు రేపు వైసిపిలో చేరనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన వైసిపి కండువా కప్పుకోనున్నారు. విశాఖకు రాజధానిగా టిడిపి వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల కిందటే ఆయన టిడిపికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు.

Read More »

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బెయిల్‌పై విడుదల

టిడిపి నేత, మాజీ మంత్రి కొల్లురవీంద్ర రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుండి బుధవారం విడుదలయ్యారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని వైసిపి నేత మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్ర అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎ-4 నిందితునిగా ఉన్న రవీంద్ర గత 53 రోజులుగా జైల్లోనే ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఆయనకు బెయిల్‌ లభించింది.

Read More »

TDP ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యేకు జగన్ సర్కార్ షాక్

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేతలకు జగన్ సర్కార్ షాకిచ్చింది. ఇద్దరు నేతలకు సంబంధించిన గ్రానైట్ కంపెనీ లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కంపెనీ లీజులు రద్దు చేసింది. క్వారీయింగ్‌లో లోపాలు ఉన్నాయని ఇద్దరు నేతల క్వారీల లీజు రద్దు చేశారట. ఎమ్మెల్యే గొట్టిపాటికి చెందిన ఐదు క్వారీలు.. సన్నిహితులకు సంబంధించిన ఆరు క్వారీల లీజు రద్దయ్యాయి.. పోతుల రామారావుకు సంబంధించిన ఒక క్వారీ లీజు రద్దైంది. అంతేకాదు గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని గతంలో జరిమానాలు విధించగా.. ...

Read More »