మేనిఫెస్టోలో పెట్లిన సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతామని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పల్లా పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం 67వ వార్డు హై స్కూల్ రోడ్లో పింఛన్లను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో 1000 రూపాయలు పెంచుతామని ఇచ్చిన హామీ నెరవేర్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి వెయ్యి రూపాయలతో పాటు రూ.3000 వేలు కలిపి రూ.4000 ఇస్తున్నామని చెప్పారు. గడిచిన మూడు నెలలు రూ.3000, ఈనెల రూ.4000తో కలిపి మొత్తం రూ.7000 లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ ఆనందంతో స్వాగతం పలుకుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు పల్లా శ్రీనివాస్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.
మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ సిక్స్ అమలు చేస్తాం పల్లా శ్రీనివాస్..
