అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో భారీ దొంగతనం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపుతోంది. కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఈ కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి. అయితే, దాదాపు 900 కియా కార్ల ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది. దీనిపై మార్చి 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు.
కియా పరిశ్రమలో భారీ చోరీ..
