కేంద్రం జాతీయ విపత్తు ప్రకటనలు చేయడంలేదని, అవసరమైతే ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదలపై కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు చేసినా రాష్ట్రంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వరదలతో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం నుంచి రూ.3 లక్షలు వస్తాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన రూ.5 లక్షల పరిహారంలో కేంద్ర నిధులు కలుపుకొంటారా? లేదా ? అనేది స్పష్టత ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఎస్డీఆర్‌ఎఫ్ కింద రూ.1300 కోట్ల వరకు ఉన్నాయని, వెంటనే ఆ డబ్బులతో బాధితులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రం పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
వరదలతో మరణించిన వారి కుటుంబాలకు కేంద్రం నుంచి రూ.3 లక్షలు..
