ఆస్ట్రేలియాలో చరణ్ కఠోర శ్రమ..

charan-12.jpg

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్ త్వరలో గేమ్‌ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఆ భారీ బడ్జెట్‌ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గేమ్‌ ఛేంజర్ విడుదలకు ముందే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేసేందుకు చరణ్ రెడీ అయ్యాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందబోతున్న ఆ సినిమా కోసం చరణ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కఠోర శ్రమ పడుతున్నట్లుగా మెగా కాంపౌండ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ నెల ఆరంభంలో రామ్‌ చరణ్‌ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. పక్కా అథ్లెటిక్ లుక్ కోసం చరణ్‌ అక్కడ ప్రత్యేక శిక్షణ పొందుతూ, కఠోర శ్రమ పడుతూ వర్కౌట్‌ లు చేస్తున్నాడట. అంతర్జాతీయ స్థాయి అథ్లెట్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ప్రముఖ ట్రైనర్ వద్ద చరణ్‌ ప్రస్తుతం వర్కౌట్స్ చేస్తున్నాడు. నాలుగు వారాల వర్కౌట్స్ తర్వాత చరణ్‌ ఇండియాకు రాబోతున్నాడు. చరణ్ తిరిగి వచ్చిన వెంటనే బుచ్చిబాబు సినిమా ను మొదలు పెట్టాలని ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఒక భారీ పల్లెటూరు సెట్‌ ను నిర్మాణం చేస్తున్నారు.

Share this post

scroll to top