వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు..

ysr-cp-14-.jpg

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో తమను అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని దేవినేని అవినాశ్‌, జోగి రమేశ్‌, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో వారికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అదే సమయంలో విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరుకావాలని కండీషన్‌ పెట్టింది. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరుకావాలని లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌41ఏ కింద మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

Share this post

scroll to top