వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తూర్పుగోదావరి జిల్లాలో భారీ షాక్ తలిగింది. జిల్లాలకు చెందని పలువురు కీలక నేతలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వ మాజీ సలహాదారు ఎస్.రాజీవ్ కృష్ణ ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. రాజీవ్ కృష్ణతో పాటు చాగల్లు జడ్పీటీసీ విజయదుర్గా శ్రీనివాస్, నిడదవోలు జడ్పీటీసీ కొయ్యా సూర్యారావు, కొవ్వూరు జడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మి, ధర్మవరం ఎంపీటీసీ జొన్నకూటి కోమలి, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, తాళ్లపూడి సర్పంచ్ నక్కా చిట్టిబాబు, దొమ్మేరు సొసైటీ మాజీ అధ్యక్షులు గారపాటి వెంకటకృష్ణ, ధర్మవరం సొసైటీ మాజీ అధ్యక్షులు ముళ్లపూడి కాశీ విశ్వనాథ్, దాపర్తి శివప్రసాద్, మర్ని తారక రాము, వల్లూరి సత్యవరప్రసాద్, నీలం వీరభద్రరావు, ఉప్పులూరి రాజేంద్ర కుమార్, ఇమ్మని వీరశంకరం, బండి అశోక్, నల్లా రామ కిషోర్, పామెర్ల నగేష్ కుమార్, నామా సురేంద్ర, వేణు కుమార్ దొప్పలపూడి, ఎన్. దిలీప్ కుమార్, బొల్లిన సతీష్, గారపాటి అభిరామ్ టీడీపీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి మంత్రి నారా లోకేశ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
వైసీపీకి భారీ షాక్ టీడీపీలో చేరిన కీలక నేతలు..
