రాజ్యంగం చేతపట్టుకుని ఎంపీగా ప్రమాణం..

prinka-gandhi-28.jpg

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌లోకి ఎంటరయ్యారు. ఇటీవల వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యాంగం పుస్తకం చేత పట్టుకుని ఆమె ప్రమాణం చేయడం విశేషం. సోదరుడు, ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు వెంట రాగా కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో ఆమె సభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఇక, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చవాన్‌ వసంతరావు కూడా ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.

Share this post

scroll to top