ఆంధ్రప్రదేశ్‌లో పోరుబాట పట్టిన వైసీపీ..

coloctor-13-.jpg

ఆంధ్రప్రదేశ్‌లో పోరుబాట పట్టింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యాచరణ ప్రకటించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇక, అందులో భాగంగా నేడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం చేపట్టారు. రైతుల సమస్యలు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న వైసీపీ రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పెట్టుబడి, గిట్టుబాటు ధర ఉచిత పంటల బీమా రద్దుతో కూటమి ప్రభుత్వం అన్నదాతను దగా చేస్తోందని మండిపడుతున్నారు. అయితే, పలు చోట్ల ఈ కార్యక్రమాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.

అనంతపురం నగరంలో రైతులకు అండగా వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టగా వైసీపీ నిరసన కార్యక్రమానికి పోటీగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టిస్తోంది. మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేరుతో వైసీపీ నిరసన కార్యక్రమం ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసింది. టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందో వివరాలతో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఓవైపు వైసీపీ నిరసన కార్యక్రమం మరోవైపు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఫ్లెక్సీ కలకలంతో అలర్ట్ అయిన పోలీసులు. బందోబస్తు ఏర్పాటు చేశారు.. తమ నిరసన కార్యక్రమానికి పోటీగా టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.

Share this post

scroll to top