సీఎం చంద్రబాబు నేడు పోలవరంలో పర్యటన..

cbn-16-.jpg

ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరానికి వెళ్లి ప్రాజెక్టు పనులను సమీక్షించనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ప్రాజెక్టు వ్యూ పాయింట్‌ వద్దకు చేరుకుని అక్కడి హెలిప్యాడ్‌ వద్ద దిగుతారు. పనుల పురోగతిని పరిశీలించిన తరువాత, ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావాస అంశాలపై అధికారులతో సమావేశమవుతారు. తాను అధికారం చేపట్టిన తర్వాత పోలవరానికి చేస్తున్న తొలి పర్యటనతో సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై తన కట్టుబాటును మరోసారి చాటారు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో ప్రతినెలా సోమవారం పోలవరానికి వెళ్ళి పనులను సమీక్షించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ కార్యక్రమానికి పునరుజ్జీవం ఇస్తున్నారు. ఈ పర్యటన రైతులు, నిర్వాసితుల్లో ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారంపై కొత్త ఆశలను నింపుతోంది.

Share this post

scroll to top