జనసేన నేత పుట్టిన రోజు వేడుకల్లో అశ్లీల నృత్యాలు..

janasena-19.jpg

ఏలూరు జిల్లా నిడమర్రు మండలంలో బావయ్య పాలెం ఈనెల 12వ తేదీ రాత్రి రైస్ మిల్లులో జనసేనకి చెందిన నాయకుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిన అశ్లీల నృత్యాలు ఘటనలో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నృత్యాలలో ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు హిజ్రాలను తీసుకొచ్చి ఫుల్లుగా మద్యం హిజ్రాలను నగ్నంగా ఉంచి చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పుట్టినరోజు పేరుతో అశ్లీల నృత్యాలు చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. భీమవరం కు చెందిన ఇద్దరు హిజ్రాలు ఈ నృత్యాలలో పాల్గొన్నట్లు గుర్తించారు. అంతేకాక జనసేన సైతం దీనిపై చర్యలు చేపట్టింది. ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రోవిడి జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు ఇంద్రకుమార్ సస్పెండ్ చేస్తున్నట్లు నిడమర్రు మండల జనసేన అధ్యక్షుడు నిమ్మల దొరబాబు ప్రకటించారు.

Share this post

scroll to top