నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనుల ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త ఏడాది లో పనులు ప్రారంభం చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అనుకున్నట్టుగానే 1200 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచింది సీఆర్డీఏ. ప్రపంచ బాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధులతో చేబడుతున్న పనులకు నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లోని భూముల్లో మౌలికవసతుల కల్పనకు వేర్వేరుగా టెండర్లు పిలిచింది సీఆర్డీఏ జోన్ 5 b 5 dలో రోడ్లు డ్రైన్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం 1206 కోట్ల రూపాయల విలువైన పనులు జరగబోతున్నాయి. ఇక, వచ్చే నెల 21వ తేదీ వరకు టెండర్ దాఖలు చేసేందుకు గడువు ఇచ్చారు. జనవరి నెలాఖరులోగా పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో మిగతా పనులకు టెండర్లు పిలవనున్నారు అధికారులు.