ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం అనంతరం గడిచిన ఆరు నెలల పాలన, రానున్న ఏడాది పాలనలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు. కేబినెట్ భేటీలో చర్చించే అంశాలు ఏంటో చూద్దాం. ఎస్ఐపీబీ అమోదించిన లక్ష 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ అమోదం తెలపనుంది. ఈ పెట్టుబడుల ద్వారా 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు కేబినెట్ అమోదం తెలపనుంది.