ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 8న మధ్యాహ్నం ఆయన విశాఖకు రానున్నారు. అనంతరం నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్కళాశాలకు వెళ్లనున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వేజోన్ పరిపాలన భవనాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. 8న ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ తొలుత విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం పర్యటనను కొనసాగిస్తారు. ఈ మేరకు ప్రధాని మోడీ విశాఖ టూర్ షెడ్యూల్ కు సంబంధించి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రధాని మోడీ టూర్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు..
