చేతగానప్పుడు శుష్కవాగ్ధానాలు దేనికి..

SAMALA-04.jpg

ఎన్నికల హామీలతో మహిళలను మోసం చేసిన‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 కేసు పెట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి శ్యామల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  మోస‌పోయిన ప్రతి మహిళా ఇప్పుడు ముఖ్య‌మంత్రిని గద్దె దించాలని అనుకుంటున్నారని చెప్పారు. శ‌నివారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో శ్యామ‌ల మీడియాతో మాట్లాడారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌ను నమ్మించి మాటిచ్చి అధికారంలోకి వ‌చ్చాక మోసం చేశార‌ని శ్యామ‌ల విమ‌ర్శించారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. దీపం పథకం ఎక్క‌డా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి.  చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవవ‌చ్చ‌ని శ్యామ‌ల అన్నారు.

Share this post

scroll to top