దేశంలో HMPV టెర్రర్.. 

gujarath-06.jpg

వైరస్‌కు సంబంధించి మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. గుజరాత్‌ రాష్ట్రంలో తొలి హెచ్‌ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. అందుతోన్న వివరాల ప్రకారం, 2 నెలల చిన్నారి HMPV వైరస్ సోకినట్లు తేలింది.  ప్రస్తుతం పాపను అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అటు కర్నాటకలో కూడా 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. ఇప్పటివరకు దేశంలో 3 కేసులు వెలుగుచూశాయి. శ్వాసకోశ వ్యాధుల విషయంలో ICMR సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Share this post

scroll to top