ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శలు గుప్పించారు. గేమ్‌ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లొస్తూ ఇద్దరు అభిమానులు మరణించిన ఘటనపై పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. పుష్పకేమో నీతులు చెప్తారా? గేమ్‌ఛేంజర్‌కి పాటించరా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అంతకుముందు గేమ్‌ఛేంజర్ ఈవెంట్ సమయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపైనా అంబటి రాంబాబు విమర్శలు చేశారు. రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్‌ఛేంజర్ ప్రీరిలీజ్ వేడుకలకు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ(23), తోకాడ చరణ్(22) అనే ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంతో మరణించారు.