అధికంగా మాంసాహారం, జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం ఈ సమస్యకు కారణమని అంటున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నవారు కొన్ని రకాల పప్పు ధాన్యాలకూ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వాటితో యూరిక్ యాసిడ్ సమస్య పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కిడ్నీల పనితీరు సరిగా లేనివారు కూడా ఈ పప్పు ధాన్యాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
బఠానీలు, శనగల్లో ప్యూరిన్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. అవి మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరిగేందుకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే తరహాలో రాజ్మా కిడ్నీ బీన్స్ లో, మినపపప్పులో కూడా ప్యూరిన్ ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. వీటిని అధికంగా తీసుకుంటే ఇబ్బందేనని పేర్కొంటున్నారు. కందిపప్పు, మైసూర్ పప్పులలో కూడా ప్యూరిన్స్ ఉంటాయని అయితే వీటిని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదుగానీ, అధిక మొత్తంలో తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.