దేశంలో రిచెస్ట్ పర్సన్ గా నాగార్జున..

nag-18.jpg

టాలీవుడ్ మన్మధుడు నాగార్జునకు తెలుగు ఆడియన్స్‌లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర స్టార్ హీరోలతో పోలిస్తే నాగార్జున అతి తక్కువ రెమ్యున‌రేషన్ తీసుకునే హీరో. సినిమాల్లో కూడా తక్కువగానే నటిస్తుంటాడు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కువగా రాణిస్తూ దాంతోపాటే ఇతర వ్యాపారాల్లోనూ డబ్బులు కూడబెడుతున్నారు. సినిమాలకు రూ.10 కోట్లు తీసుకునే నాగ్‌ వాణిజ్య ప్రకటనలకు రూ.3 కోట్ల రెమ్యున‌రేషన్‌గా చార్జ్‌ చేస్తాడు. దీంతోపాటే బిగ్ బాస్‌షో హోస్ట్‌గా వ్యవహరిస్తూ దాన్ని ద్వారా 20 నుంచి 25 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న‌ట్లు సమాచారం. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్ ప్రొడక్షన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలో ఈ సౌకర్యం అన్న మొదటి స్టూడియోగా అన్నపూర్ణ స్టూడియో నిలిచింది.

ప్రపంచ స్థాయిలో సాంకేతిక అందించేందుకు అన్నపూర్ణ ఎంటర్టైన్మెంట్ తోడ్పడుతుంది. ఇక ఎన్ క‌న్వెన్ష‌న్‌, హోటల్స్, ప‌బ్స్‌ తదితర వ్యాపారాల ద్వారా కూడా కోట్లు అర్జిస్తున్నాడు. ఇక నాగ్‌కు సొంతంగా జట్, విలాస్వంతమైన భవనాలు, ఖరీదైన ఇల్లు ఎన్నో ఉన్నాయి. వాటితో పాటే లగ్జరియాస్ కార్లు కూడా ఆయన సొంతం. అధికారికంగా ఎంత అని చెప్పకున్నా వేలకోట్ల రూపాయల అధిపతిగా రాణిస్తున్నాడు నాగార్జున. హీరోలలో ఇంత ఆస్తి కలిగిన వారు భారతదేశంలోనే చాలా అరుదుగా ఉన్నారు. ఇద్దరు ముగ్గురికి మించి ఈ రేంజ్‌లో కూడబెట్టే హీరోలు కూడా ఎవరు ఉండరని తెలుస్తుంది. నాగార్జునది బిజినెస్ మైండ్ అని డబ్బును ఎన్ని విధాలుగా సంపాదించుకోవచ్చు ఆయన చాలా షార్ప్ గా ఆలోచించగలరని గొప్ప ఆలోచనలతో డబ్బును అర్జిస్తాడని ఆయన సన్నిహితులు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటారు.

Share this post

scroll to top