వందలాది కిలోమీటర్లు ప్రయాణించి, రంగనాయక సాగర్ కు చేరిన గోదావరి గంగ. ఇది కాళేశ్వరం సృష్టించిన అపురూప దృశ్యం. అద్భుత జల సౌందర్యం. కాళేశ్వరాన్ని బదనాం చేస్తున్న కబోదుల్లారా కన్నులు తెరిచి ఈ సుందర దృశ్యం చూడండి. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణధార అనే సత్యాన్ని చెరిపేయలేమని గుర్తించండి. అయితే నంది, నారాయణపూర్ రిజర్వాయర్లలో నీటిని నింపడానికి బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన నంది పంప్ హౌసే ఇప్పుడు దిక్కయింది.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది, కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని నారాయణపూర్ రిజర్వాయర్లకు ఎల్లంపల్లి నీటిని తరలించేందుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది పంప్ హౌస్ మోటర్లే వాడాల్సి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు అనుబంధంగా నిర్మించిన వేమునూర్ వద్ద ఎల్లంపల్లి పంప్ హౌస్‌లో రెండు మోటర్లు మొరాయించడంతో మళ్లీ నంది పంప్ హౌస్ మోటర్లనే అధికారులు వినియోగిస్తున్నారు. ఇక నుంచి దాని ద్వారానే నీటిని ఎత్తిపోయాలని అధికారులు నిర్ణయించారు.