కలెక్టరేట్‌లో రమ్మీ ఆడిన రెవెన్యూ అధికారి..

anatahapuram-21-.jpg

అనంతపురం కలెక్టరేట్‌లో కలకలం రేపింది. అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి నిర్వాకం బయట పడింది. రివ్యూ మీటింగ్ లో రమ్మీ ఆడుతూ కనిపించాడు అనంతపురం DRO మలోల. ఓవైపు రివ్వూ మీటింగ్ లో అధికాలు బిజీ ఉండగా మరోవైపు DRO రమ్మీ ఆడటంపై ఖంగు తిన్నారు అధికారులు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇక అనంతపురం DRO మలోల వీడియో బయటకు రావడంతో అనంతపురం కలెక్టర్ సీరియస్ అయ్యారు. అనంతపురం DRO మలోల పై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Share this post

scroll to top