వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్‌డబ్లూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోయింది.
బాబు కక్ష ఖరీదు.. రూ.3 లక్షల కోట్లు..
![cbn-23-.jpg](https://manaaksharam.com/wp-content/uploads/2025/01/cbn-23-.jpg)