చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట.. 

cbn-28.jpg

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కి దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు లో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన సీఐడీ కేసులను వెంటనే సీబీఐ కి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టి వేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ బాలయ్య తరఫు న్యాయవాది మణీంద్ర సింగ్‌ పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని, దీనిపై మరొక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కేసును వాదించడానికి ఎలా కోర్టుకు వచ్చారని మణీంద్ర సింగ్‌ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Share this post

scroll to top