మౌని అమావాస్య పుణ్య స్నానాలు సందర్భంగా రద్దీ పెరగడంతో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. సంగం ముక్కు దగ్గర జరిగిన తొక్కిసలాటలో దాదాపు 15 మంది మృతి చెందినట్లు సమాచారం. దాదాపుగా 50 మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనపై కుంభమేళ అథారిటీ ప్రత్యేక అధికారి ఆకాంక్ష రాణా స్పందిస్తూ సంగంలోని నోస్ వద్ద భారికేడ్లు తిరిగి పడిపోవడంతో ఒక్కసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో భక్తులు అదుపుతప్పి ఒకరిపై మరొకరు పడిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే పలువురికి గాయాలయ్యాయి, వెంటనే వారిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి తరలించామని ఆమె తెలిపారు. ఈ ఘటన మరీ అంత తీవ్రమైనది కాదని ప్రస్తుతం తొక్కిసలాట జరిగిన ప్రాంతాల్లో యధావిధిగా భక్తులు వెళ్తున్నారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆకాంక్ష రాణా స్పష్టం చేశారు.