మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ కార్పొరేటర్లను తాము కొనడం లేదని చెబుతున్న కేంద్రమంత్రి దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాటలు చెప్పాలని సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి చెప్పే, పిట్టకథలు, పిల్ల కథలు గుంటూరు ప్రజలకు చెబితే నమ్మరని, టీడీపీ నేతలకు దిమాక్ ఎంత ఉందో త్వరలోనే చూస్తామన్నారు. వైసీపీ కార్పొరేటర్లను సంతలో పశువుల్లా కొంటున్నారని ఆరోపించిన ఆయన దాంతో ఉదయం మాకు సంబంధం లేదని చెప్పి, మధ్యాహ్నానికి కార్పొరేటర్ల మెడలో కేంద్రమంత్రి పసుపు కండువాలు వేస్తున్నారని, ఇదేం తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు కార్పొరేషన్ రాజకీయాలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే దిమాక్ ఉన్న వాళ్లు ఎవరూ కార్పొరేటర్లను డబ్బులతో కొనరు. మేం చేస్తున్న అభివృద్ధి చూసి వైసీపీ కార్పొరేటర్లు క్యూలు కడుతున్నారని పేర్కొన్నారు. మైకు దొరికిందని మాట్లాడే అంబటి వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు. అయితే, కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్ చేసిన అంబటి కార్పొరేటర్లను కొనడం లేదని చెబుతున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దేవుడి మీద ప్రమాణం చేసి ఆ మాట చెప్పగలరా ? అని సవాల చేశారు.