గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడమే లక్ష్యం..

murmu-31-.jpg

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో రైతులు, సైనికులు, సైన్స్‌తో పాటు పరిశోధనలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చడమే మా లక్ష్యం. దేశంలోని విద్యా సంస్థల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించాము. మధ్యతరగతి గృహాలు, గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, అలాగే చిన్న వ్యాపారులకు సైతం రుణాలను రెట్టింపు చెసినట్లు చెప్పారు.

దేశంలో మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని తమ ప్రభుత్వం విశ్వసిస్తుందన్నారు. విద్యకు ఎవ్వరు కూడా దూరంగా ఉండకూదనే ఉద్దేశంతో మాతృభాషలో విద్యకు అవకాశాలు అందిస్తున్నామన్నారు. 13 భారతీయ భాషల్లో వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించడం ద్వారా భాష సంబంధిత అడ్డంకులు తొలగుతాయని భావించామని, అందుకే భాషా పరంగా ప్రాముఖ్యత ఇచ్చామన్నారు రాష్ట్రపతి ముర్ము. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు.

Share this post

scroll to top