ఇకపై జగన్ 2.0 ని చూపిస్తా..

ys-j-05.jpg

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు విజయవాడ వైసీపీ కార్పోరేటర్లతో భేటీ అయిన ఆయన గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. కార్పోరేటర్లతో వివిధ అంశాలపై చర్చించిన అనంతరం జగన్ మాట్లాడుతూ ఈ సారి జగన్ 2.0ని చూడబోతున్నారని తెలిపారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ 2.0 వేరుగా ఉంటుందిని కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తానని తేల్చి చేప్పినట్లు తెలుస్తుంది. అలాగే తాను తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని చెప్పుకొచ్చాడు.

అలాగే రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూస్తూనే ఉన్నానని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని ఎవ్వరిని వదిలిపెట్టనని వైఎస్‌ జగన్‌ విజయవాడ వైసీపీ కార్యకర్తలతో జరిగిన భేటీలో చెప్పినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ గతంలో చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రతిరోజు ఎక్కడో ఒకచోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ప్రత్యక్ష్యంగా కేసుల్లో ఉన్న వారిని పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ కారణాల వల్ల జరిగిన ఎన్నికల ప్రక్రియలో వైసీపీ నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తూ టీడీపీ, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ నేడు విజయవాడ కార్పోరేటర్లతో భేటీ అయినట్లు తెలుస్తుంది.

Share this post

scroll to top