కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. రేవంత్‌రెడ్డి 15 నెలల పాలనలో రూ.1.52 లక్షల కోట్ల అప్పులు తెచ్చారే తప్ప తెలంగాణను ఉద్ధరించిందేమీలేదు. ఒక్క పెద్ద ప్రాజెక్టు కట్టలేదు మంచి పథకాన్ని ప్రారంభించిందీ లేదు కనీసం ఒక్క మహిళకు కూడా 2500 చొప్పున ఇవ్వలేదు. పైగా ఢిల్లీలో కూర్చొని రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి మాట్లాడి తెలంగాణ పరువుతీశారు’ అని ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
CM రేవంత్‌పై కవిత ఫైర్..
