ప‌ద‌వీ వ్యామోహంతోనే వైయస్ జ‌గ‌న్‌పై ఆరోప‌ణ‌లు..

dokka-13-1-1.jpg

రాజకీయాల్లో రంగులు మార్చే ఊసరవెల్లిలా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాసే నైజం డొక్కా సొంతం. కాంగ్రెస్ పార్టీతో రాజ‌కీయ ప్రయాణం మొద‌లు పెట్టి నేడు టీడీపీలో ఉన్న వ‌ర‌కు ఎన్నిసార్లు పార్టీలు మారారో ప్రజలకు తెలుసు. రాజీనామా చేసిన పార్టీల్లోకి మ‌ళ్లీ తిరిగి చేరుతున్న డొక్కా లాంటి వ్య‌క్తికి సిద్దాంతాల గురించి తెలుసా?  తానేదో తుల‌సివ‌నంలో ఉన్న‌ట్టు డొక్కా మాణిక్య వ‌ర‌ప్రసాద్ మాట్లాడుతున్నాడు. వైయ‌స్ఆర్‌సీపీలో ఉండి టీడీపీని తిట్టిన విష‌యాల‌ను ఆయ‌న మ‌రిచిపోయారు. ఎదుటి పార్టీల నాయ‌కుల‌ను తిడితేనే తనకు ప‌ద‌వులు వ‌స్తాయ‌నే భ్ర‌మ‌ల్లో నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రావాలి. కూట‌మి ప్రభుత్వంలో త‌న‌కు ప‌ద‌వి రాక‌పోవ‌డంతో చంద్ర‌బాబు దృష్టిలో ప‌డ‌టం కోసం నానా ర‌కాల స‌ర్క‌స్ విన్యాసాలు చేస్తున్నాడు.

ప‌ద‌వీ వ్యామోహంతో ఒక టీవీ చానెల్ డిబేట్ లో వైయ‌స్ఆర్‌సీపీ గురించి, వైయ‌స్ జ‌గ‌న్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు.  త‌న స్థాయిని మ‌ర్చిపోయి వైయ‌స్ జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప‌ద‌వుల కోసం దిగ‌జారి మాట్లాడే డొక్కాకు విలువ‌లు ఉన్నాయ‌ని  అనుకోవ‌డం లేదు. ఒక ‌పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ వారితో మంత‌నాలు చేయ‌డం ఆయ‌న‌కు అలవాటు. వైయ‌స్ఆర్‌సీపీలో ఉంటూనే టీడీపీ వారితో మంత‌నాలు చేసేవాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీ అవ‌కాశం ఇస్తే టీడీపీకి వెన్నుపోటు పొడిచిన చ‌రిత్ర డొక్కాది. మ‌ళ్లీ వైయ‌స్ఆర్‌సీపీలో ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తే ఇక్కడ కూడా వెన్నుపోటు పొడిచి టీడీపీలో చేరాడు. 

Share this post

scroll to top