సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వం ప్రధాన సలహాదారులు హాజరుకానున్నారు. ఈ భేటీలో ప్రముఖంగా భేటీలో డ్రోన్ పాలసీపై ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా పాలసీపై విధివిధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఇక, రాజధాని అమరావతిలో పలు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, NALA చట్టం రద్దుకు సంబంధించి కేబినెట్లో తీర్మానం చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో అమలు అవుతోన్న ప్రభుత్వ పథకాలపై కూడా చర్చించనున్నారు. చివరగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటనకు సంబంధించి కూడా మంత్రివర్గ భేటీలో డిస్కస్ చేయనున్నారు.
కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు..
