రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలి..

bugana-17.jpg

రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో ఆ సంఘ ప్రతినిధులను కలిసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. పన్నుల వాటా లెక్కకు 2011 జనాభా లెక్కల పరిగణన 1971 తర్వాత పలు రాష్ట్రాలలో జనాభా తగ్గింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. కాబట్టి పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్‌ కూడా ఇవ్వాలని ఆర్థిక సంఘానికి బుగ్గన నివేదించారు.

Share this post

scroll to top