ఇటీవలే ఓ హిందీ సినిమాలో నటించింది షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవా సినిమా మొన్నీమధ్య విడుదలైంది. కానీ ఆ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతమ్స్ సూర్య సరసన రెట్రో సినిమాలో నటిస్తుంది ఈ అమ్మడు. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్. ఈ క్రమంలో పూజా హెగ్డే తెలుగులోనూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు మా ఫ్యామిలీ నుంచి ప్రజర్ ఉంది. నేను కర్ణాటక నుంచి వచ్చాను, నేను తుళు అమ్మాయిని కాబట్టి కన్నడ భాషలో సినిమాలు చేయాలనీ నా పేరెంట్స్ అడుగుతున్నారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. కన్నడ సినిమా కథలను కూడా కొన్ని విన్నాను. కానీ అవి అంతగా కనెక్ట్ అవ్వలేదు. మంచి కథ దొరికితే తప్పకుండ కన్నడ భాషలో నటిస్తా నా పేరెంట్స్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.