కూటమి ప్రభుత్వం పై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. టీడీపీ నేతల సవాల్కు భూమన సిద్ధమయ్యారని గోశాల వద్దకు అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా? అంటూ మాజీ మంత్రి రోజా నిలదీశారు. సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్? అని నిలదీశారు. తిరుమలలో చాలా అపచారాలు జరుగుతున్నాయి. సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్ కల్యాణ్? అని ఆగ్రహించారు మాజీ మంత్రి రోజా. ఇక అటు తిరుపతిలో హైటెన్షన్ నెలకొంది. టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ పరస్పర సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇవాళ కచ్చితంగా గోశాలకు వస్తానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇక కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరించారు. గోశాలకు వెళ్లకుండా భూమన కరుణాకర్ రెడ్డిను పోలీసులు అడ్డుకున్నారు.
సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్ కల్యాణ్..
