లక్కీ హీరోయిన్ సంయుక్తా మీనన్..

samyuksha-28.jpg

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లానాయక్‌తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది సంయుక్తా మీనన్. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసార, ధనుష్ సార్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకుని లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్షలో నెగిటివ్ టచ్ ఉన్న రోల్ చేసి  మెస్మరైజ్ చేసింది బ్యూటీ. ఆ తర్వాత మరోసారి డెవిల్‌లో కళ్యాణ్ రామ్‌తో జోడీ కట్టింది అమ్మడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. 2023 లో వచ్చిన డెవిల్ తర్వాత కనిపించకుండా పోయింది సంయుక్త. గతేడాది సంయుక్త నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఆ గ్యాప్ ఫిల్ చేసేందుకు ఇప్పుడు అమ్మడు గట్టిగానే ప్రయత్నిస్తోంది.

వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతోంది.  ప్రజెంట్ సంయుక్త చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. అయితే వాటిలో మూడు మైథాలజీతో లింక్ ఉండే   కావడం గమనార్హం. నిఖిల్ సిద్దార్థ్‌‌తో చేస్తోన్న స్వయంభు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హైంధవ, బాలకృష్ణ అఖండ 2, తాండవం మైథాలజీ డ్రామాకు చెందిన సినిమాలుగా తెలుస్తోంది. ఇవే కాకుండా శర్వానంద్ సరసన నారీ నారీ నడుమ మురారీతో పాటు హిందీలో మహారాగ్ని క్వీన్స్ ఆఫ్ క్వీన్స్, మలయాళంలో రామ్ అనే మూవీ చేస్తోంది నందిని. నారీ నారీ నడుమ మురారి ఈ సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అఖండ 2 సెప్టెంబరు లో రానుంది. ఈ ఏడాదిలో సంయుక్త నుండి నాలుగైదు సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ లేకపోలేదు. గతేడాది వచ్చిన గ్యాప్ ను ఈ ఏడాది వడ్డీతో సహా తేర్చేందుకు రెడీ అయింది.

Share this post

scroll to top