కూటమి ప్రభుత్వం రూ.3 వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా కట్టబెట్టిన ఉర్సా మంత్రి నారా లోకేష్ బినామీ సంస్థ అని మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కారుచౌకగా ఈ సంస్థకు భూములను కట్టబెట్టాలనే కుట్రలో భాగంగానే ఉర్సా ఆవిర్భవించిందని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ అమెరికాకు వెళ్ళడానికి ముందు నెలలోనే ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయ్యిందని అన్నారు. ఇండియాలో ఆ సంస్థను రిజిస్టర్ చేసిన రెండు నెలల్లోనే వేల కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు ఆఘమేఘాల మీద ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఇది భారీ కుంభకోణం కాదా అని ప్రశ్నించారు.
భూ దోపిడీకే ఉర్సా ఆవిర్భావం..
