ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి ని తాజాగా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. గన్నవరంలోని ఆమె నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఉద్దండ రాయుని పాలెం పర్యటన వెల్లనీయకుండా వైయస్ షర్మిల రెడ్డి ని హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. శాంతి భద్రతల దృష్ట్యా షర్మిలను ఇంటిలోనే నిర్బంధించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా సింహాద్రి అప్పన్న స్వామి ఆలయ సమీపంలో గోడకూలి ఏడుగురు భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై కూడా వైఎస్ షర్మిల విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైయస్ షర్మిల.