ప్రధాని టూర్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..

amaravathi-02.jpg

మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని అమరావతి రీలాంచ్‌లో పాల్గొనబోతున్నారు. అయితే, ప్రధాని టూర్‌ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు నిఘా నీడలోకి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వెళ్లిపోయింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్గో సర్వీసులు నిలిపివేశారు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది. ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన గేటు వద్ద ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు పోలీసులు ఇక, ఎయిర్‌పోర్ట్‌ పిక్ అప్ కి వచ్చే వారికి పాస్ తప్పనిసరిగా ఉండాలంటున్నారు పోలీసులు.

మరోవైపు ప్రధాని మోడీ సభకు తరలివచ్చే మార్గాల్లో బందోబస్తు కట్టుదిట్టం చేశారు పోలీసులు 6500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారని అంచనాలు ఉండగా 37 మంది ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్ లతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన మార్గాల్లో వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పాస్‌లు ఉంటే వేదిక దగ్గరకు అనుమతి ఇస్తున్నారు. మిగతా వాహనాలకు 256 ఎకరాల్లో ఉన్న పార్కింగ్ ప్రాంతాలకు పంపిస్తున్నారు. అంతేకాదు రూట్ మ్యాప్ కోసం క్యూ ఆర్ కోడ్ లు ఏర్పాటు చేశారు అధికారులు.

Share this post

scroll to top