తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులవృత్తులను కాపాడటం కోసం గొల్లకుర్మలకు గొర్రెలు అందజేసింది. అయితే కొంతమంది దళారులు ఈ పథకంలోనూ అవినీతికి పాల్పడ్డారు. గొర్రెల స్కీమ్‌ను తమకు అనుకూలంగా మార్చుకున్న దళారులు స్కామ్‌కు పాల్పడి రూ.1200 కోట్లు కొట్టేశారు. అత్యంత సంచలనంగా మారిన ఈ స్కామ్ లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారు. అయితే ప్రధాన సూత్రదారిగా భావిస్తోన్నదళారి మొయినుద్దీన్ పరారీలో ఉన్నాడు. అతన్ని నేడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది.
తలసానికి బిగ్ షాక్..
