హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ -2025 పోటీలు జరగనున్న విషయం తెలిసిందే.ఈ ప్రతిష్టాత్మక పోటీలను నిర్వహించేందుకు తెలంంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చకచకా చేయిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్ లోని మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈవో, చైర్ పర్సన్ జూలియా ఈవేలిన్ మోర్లి శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో జూలియా మోర్లీకి అధికారులు సాంప్రదాయపద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషకరమని అన్నారు.
హైదరాబాద్‌కు మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్..
