అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి..

modi-02-1.jpg

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతి స్వప్నం సహకారం అవుతున్నట్లు కనిపిస్తోందని ప్రధాని అన్నారు. ఒక కొత్త అమరావతి కొత్త ఆంధ్రప్రదేశ్ అని మోదీ నినాదం ఇచ్చారు. అమరావతి ఒక నగరం కాదు.. అమరావతి అంటే శక్తి అని మోదీ చెప్పారు. బౌద్ద వారసత్వం, ప్రగతి కలగలిసిన ప్రాంతం ఇది అన్నారు. ప్రస్తుతం ఆయన పుణ్య భూమిపై నిలబడి ఉన్ననని అన్నారు. ఇది కేవలం శంకుస్థాపన కాదు, ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు నిదర్శనం అని ప్రధాని అన్నారు. ఏపీ అంటే ఆధునిక ప్రదేశ్ అని ఆయన అన్నారు. 

అమరావతికి ఉన్న అటంకాలు తొలగిపోయాయని మోదీ అన్నారు.  ఏఐ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ లో ఆంధ్రప్రదేశ్ అభివ‌ృద్ధి చెందుతుందన్నారు. అమరావతి మౌలిక సదుపాయాల కోసం కేంద్రం సహకరించిందని ప్రధాని మోదీ తెలిపారు. హైవే రోడ్లు నిర్మిచడం వల్ల ఏపీలో టూరిజం డెవలప్‌ అవుతుంది. గుజరాత్‌లో మోదీ, ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ వాడకం గురించి దగ్గరగా గమనించానని చెప్పారు. అమృత్ భారత్ స్కీమ్ కింద రైల్వేస్టేషన్లు ఆధునికరించామని ప్రధాని చెప్పారు.

Share this post

scroll to top