హీరో నేనే విలన్ నేనే తగ్గేదెలా..

allu-07.jpg

పుష్ప సినిమాకు ముందు అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్. బన్నీ గురించి చెప్పుకోవాలంటే ఇలాగె చెప్పుకోవాలి. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి ఐకాన్ స్టార్ ను పాన్ ఇండియా స్టార్ ని చేసింది పుష్ప. దీంతో ఈ సారి చేయబోయే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసాడు అల్లు అర్జున్. ఆ నేపథ్యంలోనే  కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమా చేస్తున్నాడు బన్నీ. కోలీవుడ్  నిర్మాణ సంస్థ సన్ పిచర్స్  ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది.

ఇటీవల ఈ సినిమాకు సంభందించిన పూజా కార్యక్రమాలు ముంబాయిలో జరిగాయి. కాగా ఈ సినిమా షూట్ మొత్తం ముంబాయిలోను అలాగే విదేశాల్లో ఉంటుందని సమాచారం. కాగా ఈ సినిమా గురించి మరోక ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ లో కనిపించబోతున్నాడట. హీరోతో పాటు విలన్ గా కూడా నటించబోతున్నాడట బన్నీ. ఇండియన్ సినిమా చరిత్రలో మునుపెన్నడూ కనిపించని విధంగా విలన్ రోల్ ను డిజైన్ చేశాడట దర్శకుడు అట్లీ. ఈ సినిమా కోసం హాలీవుడ్ కు చెందిన ప్రముఖ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ వర్క్ చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా లేటెస్ట్ గా అనన్య పాండే పేరు వినిపిస్తోంది.  బన్నీ కెరీర్ లో 22, అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ కు సంగీత దర్శకుడిగా అనిరుద్ తో పాటు సాయి అబ్యాంకర్ పేరు కూడా పరిశీలనలో ఉంది.

Share this post

scroll to top